సైదాపూర్ జనం సాక్షి: జూన్14మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం భూలక్ష్మి వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ… ఈనెల 2న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దశాబ్ది ఉత్సవాలు దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. జూన్ 2న గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ ,3న రైతు దినోత్సవం, 4న సురక్ష దినోత్సవం, 5న తెలంగాణ విద్యుత్ వజ్రోత్సవాలు,6 న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7 న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండగ, 9న తెలంగాణ సంక్షేమ సంబరాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం ,11న తెలంగాణ సాహిత్య దినోత్సవం ,12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య ఆరోగ్య దినోత్సవంతో పాటు గ్రామపంచాయతీ పరిధిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు .గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఎలా ముందుకు పోయిందని విషయాలను ప్రజలు మననం చేసుకోవాలని గుర్తు చేశారు. 24 గంటల విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ,వార్డు సభ్యులు రేగుల సురేష్, మాతంగి వెంకటయ్య, దొనపాటి రమాదేవి, మ్యాదరి శిరీష, వివో ఏ శ్రీలత, మహిళలు, యువతులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు
దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి -సర్పంచ్ కాయిత రాములు -లస్మన్నపల్లిలో ముగ్గుల పోటీలు




