Thursday, 5 November 2026

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్కకు వినతి

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్కకు వినతి

గంగారం నవంబర్ 15 (జనం సాక్షి)
గంగారం మండలం లో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రోజున వినతి పత్రం సమర్పించారు. దీనికి ములుగు ఎమ్మెల్యే సీతక్క సానుకూలంగా స్పందిస్తూ ఇంక మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే అట్టి భూమిని గుర్తించి త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చూస్తామని ఎమ్మెల్యే సీతక్క సానుకూలంగా స్పందించారు. దీంతో మండల విలేకరులు శాలువా పూలమాలలతో ఎమ్మెల్యేను సన్మానించారు.