Thursday, 5 November 2026

భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 15(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో మంగళవారం భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హన్మకొండలోని శరత్ ఐ హాస్పిటల్ వారు నేత్ర పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు, వృద్ధులు, పిల్లలు నేత్రాల పరీక్ష చేసుకొని తగిన విధంగా వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి మహిళ సంక్షేమ మండలి అధ్యక్షురాలు పోతు రమాదేవి, కార్యదర్శి గజ్జి రమాదేవి, కోశాధికారి చిట్ల సంధ్యారాణి, ఉపాధ్యక్షురాలు కావటి రమాదేవి, సలహాదారు బజ్జూరు జయ గౌరి, కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి రమాదేవి, మాటేటి శారద, తిరునగరి గీత, పోతు ధనలక్ష్మి, వంగ అనుష, సకినాల సునీత, కుసుమ కవిత, చిమ్మని భార్గవి, ఆకుతోట అనూష, తదితరులు పాల్గొన్నారు