బాలల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్
కూకట్ పల్లి జనంసాక్షి :
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 124 డివిజన్ పరిధి ఇంద్రహిల్స్ లోని స్నేహ మోడల్ స్కూల్లో నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై పిల్లలతో కలిసి జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. బాలలు సక్రమమైన మార్గంలో పెరగడానికి, వారి అందమైన బాల్యం ఆహ్లాదంగా, ఆనందంగా కొనసాగడానికి తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులు తగిన సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చదువులోను మరియు క్రీడలలో రాణించిన విద్యార్థులకు కార్పొరేటర్ చేతులమీదుగా సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, స్నేహ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మమతారాజ్, కరస్పాండెంట్ ఎం.రాజు, అధ్యపకబృందం ఆర్.రేణుక, వనజ, శారద, కృప, నాగమణి, సోనీ, సాయిప్రియ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.




