;-ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచేది జర్నలిస్టులే
;-మాలమహానాడు జిల్లా అధ్యక్షులు సాధు నర్సింగరావు
జనం సాక్షి, చెన్నరావు పేటకరోనా లాంటి ఆపద సమయంలో నిజాలను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేసింది జర్నలిస్టులే.స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ గద్దెలు కదిలించేలా ముఖ్య పాత్ర పోషించింది జర్నలిస్టులే అని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు సాధు నర్సింగరావు అన్నారు.చెన్నారావుపేట మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు తీపి కబురు అందించడం శుభసూచకమని, ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ కీలక భూమిక పోషిస్తున్న జర్నలిస్టులకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వెంటనే ఇండ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సాధించడానికి ఆనాడు సాగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ఢిల్లీ గద్దెను కదిలించడంలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉన్నారని తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించారని, అలాగే స్వరాష్ట్రం సాధించాక ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ముందు వరుసలో పనిచేస్తున్నారని, పత్రికా రంగంలో ఆర్థిక వనరులు లేక ఆత్మాభిమానాన్ని కాదనుకోక రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ప్రజలకు ప్రయోజనం చేకూరే విదంగా పనిచేస్తుంటే ప్రభుత్వం మాత్రం జర్నలిస్టుల పట్ల వివక్ష చూపడం చాలా బాధాకరమని ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించేలా ఆయా మండలాల తహశీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.




