బచ్చన్నపేట జూన్ 13 (జనం సాక్షి)
సమాజా నిర్దేశకులు జర్నలిస్టులని జనగామ ఏసీపీ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంకు హజరైన ఆయన ఇటీవల ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్ జర్నలిస్టు కార్యవర్గాన్ని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ముప్పై ఏళ్లుగా జర్నలిస్టులుగా పని చేయడం అభినందనీయమని అన్నారు. వివిద దిన పత్రికల్లో పని చేస్తున్నా ఐఖ్యంగా క్లబ్ గా ఏర్పాటు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు తెలుకంటి మురళి, ముశిని వీరాగౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి,గంట తిరుమల్ రెడ్డి, మంచాల సంతోష్ కుమార్, రెడ్డబోయిన హరికుమార్,తెలుకంటి శ్రీనివాస్,మాల్యల బాలనర్సయ్య,తాడిచెట్టి భాస్కర్,సందెల బాలసిద్దులు,పంబాల మల్లేషం,గర్నపల్లి కర్ణకార్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులు సమాజ నిర్దేశకులు ఏసిపి దేవేందర్ రెడ్డి




