హుజూర్ నగర్ జూన్ 13 (జనంసాక్షి): హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మౌళిక వసతులు కల్పించి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి అన్నారు. మంగళవారం పట్టణంలోని 24 వ వార్డు లో రూ.4 లక్షల రూపాయలతో మంజూరైన సీ సీ రోడ్ పనులకు వార్డు కౌన్సిలర్ గుంజ భవాని తో కలిసి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 24 వార్డు ఇంచార్జీ, తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు యడ్ల విజయ్, కౌన్సిలర్ యరగాని గురవయ్య, నాయకులు దొంతిరెడ్డి నవీన్ రెడ్డి, ఎం డీ. లతీఫ్, గుంజ వెంకన్న, పందిపోటు గోపయ్య, పయ్యావుల రమేష్, పుష్ప, సంధ్య, ధనలక్ష్మి, కాంట్రాక్టర్ వేముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు కృషి




