సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 28 : -సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు (డీఈఓ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సర్య్కులర్ జారీ చేశారు. 2023–24 విద్య సంవత్సరానికి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ ఇటీవల సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం గతంలో డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ. ఈ సర్క్యూలర్ జారీ చేశారు.ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలపై అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సాయినాథ్, కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, అసోసియేషన్ సభ్యులు వీరేందర్ గౌడ్, అశోక్ బాబు, రఘు నాయక్, రమేష్ లు హర్షం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రాయితీ -సర్క్యులర్ జారీ చేసిన సంగారెడ్డి డీఈఓ వెంకటేశ్వర్లు -హర్షం వ్యక్తం చేసిన సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు




