సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 28 : – శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవములు సందర్భంగా సంగారెడ్డి జిల్లా గోకుల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించినా వీరాశివ లింగాయత్ సమాజం జిల్లా మహోత్సవంలో తనకు శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులు శ్రీ డాక్టర్ చిన్న సిద్ధి రామ పండితారాధ్య శివాచార్య స్వాములవారి ఆధ్వర్యంలో వీరశైవ పురోహిత రత్న అవార్డు బహుకరంచిచడం చాలా ఆనందంగా ఉందని బడెంపేట జగదీశ్వర్ స్వామి అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనపై వీరశైవ లింగాయత్ సమాజం పెద్దలు ఎంతో గురుతరమైన బాధ్యత పెట్టారని, ఆ బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తానని అన్నారు. కోహిరు మండలం పరిధిలోని బడంపేట గ్రామం శివారులో ఉన్న శ్రీ రాచన్న స్వామి ఆలయంలో తాను పూజారిగా
పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తించి పురోహిత రత్న అవార్డు నివ్వడం చాలా ఆనందంగా ఉందని తనకు అవార్డునిచ్చినందుకు వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. శ్రీ జగద్గురువుల పర్వచనం వినుట వారి దర్శన భాగ్యము మనందరికీ కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇట్లు కార్యక్రమానికి బృహత్తర కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన ప్రతి ఒక్క వీరశైవ లింగాయత్ నాయకులకు కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం పెద్దలు ఆత్మీయులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.




