జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా ప్రమాద బీమా కోసం ప్రీమియం చెల్లిస్తా టీయూడబ్లుజే నాయకులకు ఎమ్మెల్యే
పైళ్ల శేఖర్‌రెడ్డి భరోసా
భువనగిరి జనం సాక్షి,
ఆగష్టు,22
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్లు్య ఐజేయూ జిల్లా కమిటీ భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈసందర్భంగా సానుకూ లంగా స్పందించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలోనే యూనియన్ ప్రతినిధులు కలిసి ఇచ్చిన వినతి మేరకు అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.కలెక్టర్‌కు
ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.అలాగే గృహలక్ష్మి పథకంలో అర్హులకు రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. విధినిర్వహణలో గాయపడిన,చనిపోయని జర్నలిస్టుల కుటుంబాలకు రూ10 లక్షల బీమా సహాయం కోసం ప్రీమియం పోస్టల్‌శాఖకు చెల్లిస్తామని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. వెంటనే యూనియన్ తరపున ప్రిమీయం కోసం పేర్లు,వివరాలు అందజే యాలని కోరారు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యంబ నర్సింహులు,కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్ ఎలక్ట్రానిక్ మీడియ అధ్యక్షులు భువనగిరి మల్లేష్,వెలుగు స్టాప్ రిపోర్టర్ కందుకూరి సోమయ్య లు ఉన్నారు.ఎన్నికలు దగ్గరప పడుతున్న నేపధ్యంలో జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ను కోరారు.