Thursday, 5 November 2026

దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం

దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం

మల్దకల్ జనవరి 11 (జనంసాక్షి)ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ఇతోదికంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు.మంగళవారం దేవాలయ చైర్మన్ ప్రహల్లాదరావు హైదరాబాదులోని కెవిరమణ చారిని,దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను వేర్వేరుగా కలిసి స్వామివారి ప్రసాదం, చరిత్ర పుస్తకాన్ని అందజేసి శేష వస్త్రంతో సన్మానించారు.ప్రజల, అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ప్రహల్లాద రావు వారికి వివరించారు.దేవాలయ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు