జనం సాక్షి, చెన్నారావుపేటచెన్నారావుపేట మండలానికి చెందిన జనం సాక్షి మండల రిపోర్టర్ పాలడుగుల నాగరాజు సతీమణి తల్లి తాళ్లపెళ్లి సమ్మక్క వీరి స్వగ్రామమైన గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో ఇటీవల మరణించగా, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ.ఏ.జే.ఎఫ్) రాష్ట్ర నాయకులు కొల్లూరి నాగరాజు, తోటి జర్నలిస్టులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించి, పరమార్శించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శోభన్, శ్రీనివాస్, రమేష్, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన టీ.ఏ.జే.ఎఫ్ రాష్ట్ర నాయకులు




