దౌల్తాబాద్ జూన్ 6, జనం సాక్షి.మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన టీఎమ్మార్పీఎస్ నాయకులు బాలిగారి కృష్ణ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని సిద్దిపేట జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుర్రాల శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనోధైర్యంగా ఉండాలన్నారు. కృష్ణ తల్లిని కోల్పోవడం బాధాకరం అన్నారు. వారితో పాటు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డప్పు శివరాజ్ మాదిగ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బండారు దేవేందర్, గంగాధరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గుర్రాల శ్రీనివాస్




