చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- దశాబ్ది ఉత్సవాలు కాదు టిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉత్సవాలు ఒక వైపు రైతులు వడ్లు పోక అరిగోస పడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దశబ్ది ఉత్సవాల పేరుతో ప్రచారం మొదలుపెట్టిందనీ మండల బీజేపీ నాయకులు మల్కనీ నగేష్, శ్రీకాంత్ గౌడ్ లు అన్నారు. ఇందుకు అధికారులను సైతం ఉపయోగించుకుంటు ప్రచారం చేస్తుండడం సిగ్గుచేటు అన్నారు. అధికారులకు ప్రజల సొమ్ముతో జీతాలు వస్తున్నాయా లేక బిఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ నుండి జీతాలు వస్తున్నాయ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయాన్నారు. గంగారాం గేటు వద్ద నుండి గంగారాం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజబాద్ గ్రామాల మీదుగా ఫైజబాద్ గేటు వరకు గతంలో బిటి రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పటి వరకు కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడం గమనార్షం. కమిషన్ ల కోసం ఇబ్బందులు పెట్టడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని వారు మండిపడ్డారు. ఈ రోజు అజ్జమర్రి చెక్ డ్యామ్ ను ప్రారంభించడానికి మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి వస్తున్నారని నామమాత్రంగా మొరం పోసి గుంతలు పుడ్చడం విడ్డురంగా ఉందన్నారు. అలా మొరం పోయడం వల్ల రేపు ఒక్క వాన చినుకు పడ్డ కూడా వడ్ల లారీలు కూడా పోనీ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేశారాని దశబ్ది ఉత్సవాలు జరుపుతున్నారో చెప్పాలన్నారు. అజ్జమర్రి గ్రామాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి దత్తత తీసుకున్నారు, దత్తత తీసుకోని ఏ ఒక్క పని అన్న చేసినవా, వచ్చిన సిసి రోడ్లు యన్ ఆ




