హైదరాబాద్ జనంసాక్షి : జర్నలిస్ట్ వృత్తి ఎంతో అమూల్యమైనదని అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ టెలిఫోన్ డైరీని ఆయన ఆవిష్కరించారు. సమైక్య రాష్ర్టంలో పాత్రికేయుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని స్పీకర్ గుర్తుచేశారు. ఎంతో మంది పాత్రికేయులు దుర్భర జీవితం గడుపుతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పీకర్ మధుసూదనచారిని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.




