-జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా అహ్మదుల్లా ఖాన్.
-ఏకగ్రీవమైన కార్యవర్గం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జనవరి 13(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ వర్కింగ్ జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడిగా అహ్మద్దుల్లా ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శుక్రవారం సొసైటీ కార్యాలయంలో కోఆపరేటివ్ శాఖకు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్,ఎన్నికల అధికారి సి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.11 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా అధ్యక్షుడిగా మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ అహ్మదుల్లా ఖాన్, ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ముచ్చర్ల దినకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా కె ఎస్ సురేష్ (జెమిని సురేష్), కోశాధికారిగా ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ సి సురేష్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా ఎం, చంద్రశేఖర్ రావు, తిప్పర్తి విజయ్ కుమార్, పుట్టపాగ వెంకటస్వామి, కొండ కింది మాధవరెడ్డి, హెచ్.ఉమాశంకర్, జి.సత్యనారాయణ, కందికొండ మోహన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సొసైటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు ఎండి.అబ్దుల్లా ఖాన్, పరిపూర్ణం,పి.విజయ్ కుమార్, సాయిలు సాగర్, కందికొండ రమేష్ లతోపాటు ఏటిగడ్డ వెంకటేష్, మహమ్మద్ దర్వేష్, మహమ్మద్ నజీర్ అహ్మద్ లు ఉన్నారు.కోఆపరేటివ్ శాఖకు చెందిన జూనియర్ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి ఉన్నారు. నూతన కార్యవర్గాన్ని కార్యవర్గ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన కార్యవర్గం తరపున అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.




