హైదరాబాద్: జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వేలకోట్లు నిధులు దుర్వినియోగం జరిగిందని ఆయన ధ్వజమొత్తారు. కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ కోట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఖాతాలో మరో అతిపెద్ద కుంభకోణం పోలవరం ప్రాజెక్టు అని తెలిపారు. రాష్ట్రంలో రూ. 75 వేల కోట్లు ఖర్చుచేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అవినీతి కారణంగానే సాగు, తాగు, విద్యుత్ కొరత ఏర్పడిందని తెలిపారు. విద్యుత్‌కోత, నీరు లేక ప్రజలు వలసబాట పడుతున్నారని పేర్కొన్నారు.




