జహీరాబాద్ గడ్డ పైన నీలి జెండా ఎగరేస్తాం
-బహుజన్ సమాజ్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ శశికాంత్
జహీరాబాద్ డిసెంబర్ 21( జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సుధీర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గిరికల శశికాంత్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ అనేది త్యాగాలతో కూడుకున్న పార్టీ అని అందులోనే భాగంగా బహుజన బ్రతుకులు మార్చడం కోసం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఆయన త్యాగాన్ని నీరు గారనివ్వమని, ఆయన అడుగుజాడల్లోనే బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు.
బి ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా జహీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యాధికార యాత్ర తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.వచ్చే నెల 4వ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి పస్తాపూర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు స్వేరోలు స్వేరో అనుబంధ సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీని విజయవంతం చేయగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సుధీర్ ఇన్చార్జి సతీష్, మున్సిపల్ ప్రెసిడెంట్ బబాన్న , సీనియర్ నాయకులు పద్మారావు ,దేవెందరప్ప ,శ్రీనివాస్ నాయకులు లవ కుమార్, తుక్కరాం,పవన్, నర్సింలు,సతీష్,నాగరాజ్ కశింపుర్,మహేష్,సురేష్, తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ గడ్డ పైన నీలి జెండా ఎగరేస్తాం




