Saturday, 7 November 2026

వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలి.

వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలి.
ఫొటో : ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 21, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే చిన్నయ్య సూచించారు. బుధవారం ఆయన ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఆసుపత్రి పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆసుపత్రి సూపరిండెంట్ అరవింద్, వైద్యులు సకారం, షబ్బీర్, కిరణ్ కుమారి, బీఆరెస్ నాయకుడు రాం చందర్ తదితరులు ఉన్నారు.