బీఆరెస్ పార్టీలో భారీగా చేరికలు.
ఫొటో : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 21, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తాండూర్ బీజేపీ మండల అధ్యక్షురాలు సంఘర్షిత శీతల్, మహిళా మోర్చా బీజేపీ కార్యదర్శి కొప్పుల రవళి, బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు చీటి పోశం, కంది రాజేశ్వర్ రావు, నయీమ్, హాజి, సరళ, ఫాజిమా, కల్పన తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కేసిఆర్ పాలనలో బీఆరెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన ముఖ్య కార్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, ఆసరా పెన్షన్స్, రైతు బందు, రైతు భీమా, దళిత బందు వంటి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రత్యేకించి మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనారిటీ గురుకుల పాఠశాలలు, విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేసే రాష్ట్రము దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆరెస్ పార్టీలో భారీగా చేరికలు




