సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలి
-జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, జనవరి 13 (జనం సాక్షి);
సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్ళే వారు తగు జాగ్రతలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఊర్లకు వెళ్లే సంధర్బంగా ఇండ్లను విడిచే వెళ్లే సమయంలో ఇంట్లో బంగారు, నగదు దొంగతనాలకు గురి కాకుండా బద్రపరచుకోడం గురించి, సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండ తల్లీ దండ్రులు చూసుకోవడం గురించి తగు సూచనలు చేస్తూ వాటిని పాటించవలసిందిగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ కోరారు. మీ ఏరియాలో అనుమానితులు ఎవరైనా కనబడితే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండనీ,లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం నెo: 9494921100 ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జిల్లా లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల పోలీస్ యంత్రాంగం నిరంతర తనిఖీలు చేపడుతుందని, అలాగె జూదం, కోళ్ల పందాలు అడే వారి పట్ల టాస్క్ ఫోర్స్ బృందాలు తో నిఘా ఉంచామని ప్రజలు ఎవరు కుడా జూదం, కోడి పందాలు వైపు వెళ్లవద్దని అలాంటి వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలి




