Tuesday, 3 November 2026

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు 

 

 

 

 

 

 

 

 

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొడకండ్ల,జనవరి30(జనంసాక్షి)కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  గాంధీ చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్  సురేష్ నాయక్.అనంతరం మాట్లాడుతూ నాడు అహింసే మార్గంగా, దేశాన్ని ఒక్కథాటిమీదకు తీసుకొచ్చి దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి కలిగించిన మహాత్ముడు అని ఆ మహాత్మునిని ఈరోజు స్మరించుకోవటం భారతీయులుగా మనందరి కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి మురారీశెట్టి, ఐతరాజు రాజు , దూదిమెట్ల యాకేష్ యాదవ్, ధర్మరపు భిక్షపతి, జాటోత్ రాహుల్, ఎండి కలీం, వనభోజ రమేష్, జంపాల శ్రీనివాస్, దొర్ణం సోమయ్య, శ్రీనుసోమారపు ఐలయ్య, భూఖ్య శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.