Tuesday, 3 November 2026

జోడో యాత్ర విజయవంతం

 

 

 

 

కొడకండ్ల,జనవరి 30(జనంసాక్షి)
కాంగ్రెస్ అగ్ర నేత ఎంపీ రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన సందర్భంగా కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్న శ్రీ శీరిడి సాయిబాబా గుడిలో కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ ధరావత్ సమక్షంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది.అనంతరం సురేష్ నాయక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,జోడో యాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కాంగ్రెస్ పార్టీ అభిమానులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి మురారీశెట్టి అంజయ్య మండల కార్యదర్శి ఐతరాజు రాజు మండల యూత్ అధ్యక్షులు దూదిమెట్ల యాకేష్ యాదవ్, మండల యసి సెల్ అధ్యక్షులు ధర్మరపు భిక్షపతి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు జాటోత్ రాహుల్ నాయక్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కలీం మండల బీసీ సెల్ అధ్యక్షులు వనభోజ రమేష్, శ్రీనివాస్, సోమయ్య, శ్రీనుసోమారపు ఐలయ్య, భూఖ్య శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.