Tuesday, 3 November 2026

భారత దేశ ప్రజలకు మనో ధైర్యం కల్పించే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు

 

 

 

 

 

కు సర్వమత ప్రార్థనలుభారత దేశ ప్రజలకు మనో ధైర్యం కల్పించే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు కు సర్వమత ప్రార్థనలుభువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణ హౌసింగ్ బోర్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి నిర్వహించి భావిభారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు భారత దేశ ప్రజల ఐక్యత చాటడం కోసం 7 సెప్టెంబర్ 2022న కన్యాకుమారి నుండి భారత్ జోడోయాత్ర ప్రారంభించి నేడు జమ్ము కాశ్మీర్ శ్రీనగర్ లో లాల్ చౌక్ వద్ద శ్రీ రాహుల్ గాంధీ గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి యాత్ర ముగింపు చేయడం జరిగింది. ఈ యాత్ర భారతదేశంలో 14 రాష్ట్రాల గుండా 77 జిల్లాలలో 134 రోజులగా భారత్ జోడో యాత్ర సాగి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులో జాతీయ జెండాను ఎగురవేసి సర్వమత ప్రార్థనలను నిర్వహించి ఈసందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడోయాత్ర యావత్ భారతదేశం లోని ప్రజలకు లౌకికవాదులకు ఎంతో మనోధైర్యాన్ని కల్పించిందని మనువాద సిద్ధాంతాలను అమలు చేసే రాజ్యాంగ వ్యతిరేక శక్తుల పట్ల భారత్ జోడోయాత్ర రాహుల్ గాంధీ కులాలకు మతాలకు అతీతంగా మనోధైర్యం దెబ్బతింటున్న భారతదేశ ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంలో ఈరోజు కాశ్మీర్ లో జాతీయ జెండాను ఎగరవేసి జాతి సమేతంగా చాటిన మహోన్న వ్యక్తిగా భారతదేశ కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తుల కుటుంబంలో జన్మించి అనగారిన పేద ప్రజలు అధైర్య పడుతున్న తరుణంలో నేటి కేంద్ర ప్రభుత్వానికి భారత్ జోడోయాత్ర ద్వారా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్  రాసిన రాజ్యాంగానికి చెక్కుచెదరకుండా అమలు చేయాలని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే భారత్ జోడోయాత్రలో భారత దేశ ప్రజలంతా ముక్తకంఠంతో తిరుగుబాటు చేసే సంకల్ప యాత్ర చేశారని అన్నారు రానున్న తరుణంలో కేంద్రంలో రాష్ట్రంలో లౌకిక ప్రజాస్వామ్య  కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్ కైరంకొండ వెంకటేష్ ఈరపాక నరసింహ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు పిట్టల బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమానుతుల రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ముత్యాల మనోజ్ పిన్నింటి స్టాలిని మాటూరి బాలేశ్వర్ శేఖర్ బొక్క జనార్దన్ రెడ్డి సైదులు రెడ్డి భాస్కర్ రెడ్డి సర్వమత పెద్దలు పంతులు వెంకటేశ్వర శర్మ ఫాస్టర్ స్వామి దాస్ ఇమామ్ కరామతుల్లా తదితరులు పాల్గొనడం జరిగింది.