జాతీయస్థాయికి ఉపాద్యాయిని ఇన్స్పైర్ ప్రాజెక్ట్ ఎంపిక
రామారెడ్డి. జనవరి 13 జనంసాక్షి. :
జాతీయస్థాయికి ఉపాద్యాయిని ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయినట్లు రామారెడ్డి కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన 9, 10, 11 వ తేదీలలో నిర్మల్ లో జరిగిన ప్రదర్శనలు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేజీబీవీ రామారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని అనూష గైడ్ టీచర్ ద్వారా ప్రదర్శించిన” ( ఆహార ధాన్యా ల ఆరబెట్టేది ) అనే విధానాన్ని ప్రదర్శన జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. రైతులు పరిధా న్యాలు ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను సమస్యను పరిష్కరించడానికి చక్కటి సులువైన టువంటి ప్రాజెక్టును ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం నిజంగా కామా రెడ్డి జిల్లా కు వన్నె తెచ్చుకోవడం గర్వకార ణంగా ఉందన్నారు. విద్యార్థిని తేజస్వికి దేవాదాయ న్యాయ , శాస్త్ర సాంకేతిక మహత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. విద్యార్థినిని, గైడ్ టీచర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , జిల్లా సైన్స్ అధికారి ఎం సిద్ధిరాంరెడ్డి లు అభినందించడం జరిగిందని చెప్పారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించి అభినంనలు తెలుపాభని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఉపాద్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.




