స్థానిక కృష్ణవేణిత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ఎంతో అందమైన రంగవల్లికలను పాఠశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు బహుమతులను ప్రధానం చేశారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత విశిష్టతను విద్యార్థులు అందరికీ తెలియపరిచారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ
సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే “మారడం” అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. పండగ విశిష్టతను తెలియపరచారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు
స్థానిక కృష్ణవేణిత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు పాఠశాల




