జాతీయస్థాయి అధికారుల సంఘం ఎన్నికల్లో సింగరేణి నుంచి తొలిసారిగా ఇద్దరికి చోటు…….
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఏవీ రెడ్డి…..
వైస్ ప్రెసిడెంట్ గా పి రాజీవ్ కుమార్ ఎన్నిక…….
జాతీయస్థాయిలో సింగరేణి అధికారులు బలపరిచిన ప్యానెల్ కే సంపూర్ణ విజయం……
నూతన బాడికి అభినందనలు తెలిపిన సీఎం ఓ ఏ ఐ సింగరేణి బ్రాంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కం రమేష్ ఎన్ వి రాజశేఖర్ రావు……
కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి ఎన్నికల్లో సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు బలపరిచిన
బ్లాక్ డైమండ్ పానెల్ సంపూర్ణ విజయం సాధించింది. శుక్రవారం సాయంత్రం నాగపూర్ లో హోరా హోరీగా జరిగిన అపెక్స్ బాడీ ఎన్నికల్లో అధ్యక్షులుగా.డి .ఎన్. సింగ్ జనరల్ సెక్రెటరీగా సర్వేష్ సింగ్ ఎంపిక కాగా ఈ ప్యానల్ నుంచి పోటీ చేసిన సింగరేణి అధికారుల సంఘ నేతలు ఏవీ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గాను పి రాజీవ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గాను కేంద్ర కమిటీకి ఎంపికయ్యారు .ఈ విధంగా ఇద్దరు నాయకులు ఒకేసారిగా కేంద్ర సంఘంలో స్థానం సంపాదించడం ఇదే ప్రధమం. ఈ ఎన్నికల్లో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ కీలక పాత్ర పోషించింది.అధ్యక్షులు జక్కం రమేష్, జనరల్ సెక్రెటరీ ఎన్.వి.రాజశేఖర్ రావు తాము బలపరిచిన బ్లాక్ డైమండ్ పానెల్ గెలుపొందడంలో కీలక భూమిక పోషించారు.
ముఖాముఖిగా జరిగిన ఈ పోటీలో బ్లాక్ డైమండ్ నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలుపొందడం విశేషం.
ఎన్నిక ప్రక్రియ ఇలా ….
బొగ్గు పరిశ్రమలు పనిచేసే అధికారుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశాబ్దాల క్రితం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను అధికారులు స్థాపించుకున్నారు.దీనిలో కోలిండియా అనుబంధ 8కంపెనీలకు చెందిన 16 వేల మందిఅధికారులు , సింగరేణి సంస్థలో పనిచేసే 2000 మంది అధికారులు సభ్యులు గా ఉన్నారు . ఈ సంఘం ప్రధానంగా
అధికారుల జీతభత్యాలు, ప్రమోషన్లు తదితర సమస్యలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు కోల్ ఇండియా,సింగరేణి యాజమాన్యాలకు నివేదిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటుంది . ప్రజాస్వామ్య విధముగా జరిగే ఈ సంఘం ఎన్నికలను ముందుగా కంపెనీల వారీగా నిర్వహిస్తారు. కంపెనీ స్థాయి అధికారుల సంఘం కమిటీలను ఎంపిక చేసిన తర్వాత జాతీయస్థాయి కమిటీని మూడేళ్లకు ఒకసారి ఎన్నుకుంటూ ఉంటారు. ప్రతి వంద మంది అధికారులకు ప్రాతినిధ్యం వహించేల ఒక అధికారిచొప్పున ఎన్నుకొని కేంద్ర కమిటీ(అపెక్స్ బాడీ) ఎన్నికల ఓటర్ల జాబితా లో స్థానం కల్పిస్తారు .ఈ ఓటర్లు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు . ఈఏడాది కూడా ఇదే ప్రక్రియలో కేంద్ర కమిటీ ఎంపిక జరిగింది.
కొత్తగా ఎంపికైన కేంద్ర కోల్ మైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వానికి, సింగరేణి నుంచి కీలక పోస్టులకు ఎంపికైన ఏవీ రెడ్డి రాజీవ్ కుమార్ లకు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు జక్కం రమేష్, ఎన్.వి. రాజశేఖర్ రావులు తమ అభినందనలు తెలియజేశారు.




