Sunday, 8 November 2026

మాజీప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ఘన నివాళులు

మాజీప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ఘన నివాళులు…

భైంసా రూరల్ డిసెంబర్ 25 జనం సాక్షి

 

బై0సా పట్టణంలోని దారబ్జీ ఫ్యాక్టరీ భోస్లే మోహన్ రావ్ పాటిల్ గారి కార్యాలయం లో ఆదివారం దివంగత మాజీ భారతప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి ఘనంగా నిర్వహించారు.సందర్భంగా బిజెపి నాయకులు,కార్యకర్తలు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ….అటల్ జీ కుల మత బేధాలు లేకుండా అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చెయ్యడం, భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చెయ్యడం గర్వించదగ్గ విషయమని,శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో అబ్దుల్ కలాం బృందానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని,భారత విదేశాంగ మంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా హిందీలో ప్రసంగించి వాజ్‌పేయి చరిత్ర సృష్టించారన్నారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించి హిందీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారాని అన్నారు.
అయన చేసిన మరెన్నో మంచి పనులను,సాహసోపేత నిర్ణయాలు గుర్తుచేసుకుని జాతీయ సుపరిపాలన దినోత్సవ వేడుకలను జరుపుకున్న బీజేపీ నాయకులు, అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు.
ఈ కార్యక్రమం లో సుభాష్, గాలి రవి , అల్లం దిలీప్,మనోజ్ సేఠ్ , విలాస్ పటేల్,మాణిక్ తదితరులు పాల్గొన్నారు