Tuesday, 3 November 2026

తెలంగాణ సాయుధ రైతాంగ పోరట యోధుడు తొలి అమరుడు దొడ్డి

;-ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

;–సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొట్టెపాక రవి పిలుపు

;–హన్మకొండ ప్రతినిది జులై 4 జనంసాక్షిదామెర మండలంలోని ఓగులాపూర్ శివార్ భూ పోరాట కేంద్రంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు _ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొట్టెపాక రవి మాట్లాడుతూ

పేద ప్రజలకు కర్మ కర్త క్రియ దొడ్డి కొమురయ్య ప్రత్యేక పాత్ర పోషించిన ఘనత కేవలం దొడ్డి కొమురయ్యకే దక్కుతుంది ప్రతి ఒక్కరు సామాజికంగా ఎదగాలని తన యొక్క ఆశయం.నేటి సమాజానికి.. వారి అందించిన స్ఫూర్తితో అంతరాలు లేని సమాజం కొరకు అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా.. నేటి ప్రజలకు విద్య, వైద్యం, కూడు…గూడు ఉపాధి కోసం ఉద్యమించవలసిన బాధ్యత అందరి పై ఉందని సమాజంలో పీడిస్తున్న దారిద్యానికి వ్యతిరేకంగా అసమాతలకు వ్యతిరేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటలు కోనసగీంచలనిస్వాతంత్రం వచ్చి దశాబ్దాలు కలుస్తున్న పేదవాడు మరింత పేదవాడుగా ధనవంతులు మరింత ధనవంతులుగా . అసమానతలు లేని సమాజం కోసం అందరికీ విద్యా, వైద్యం, న్యాయం, ఇల్లు ఇళ్ల స్థలాలు ఉపాధి మార్గాలు మానవ వనరులు ఉపయోగించుకుని ఈ దేశ అభివృద్ధి కోసం దొడ్డి కొమరయ్య గారి చైతన్యంతో ముందుకు సాగాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అంబి సాంబయ్య దండు భాస్కర్ రాజేష్ ప్రమీల వేల్పుల అఖిల గుడికందుల శివకుమార్ మాధురి కృష్ణ యాదవ్ పేరాల అరుణ కుమారి 500 మంది సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.