Wednesday, 4 November 2026

జాతీయ ఓటర్ దినోత్సవం

రాజాపేట, జనవరి25 ( జనం సాక్షి): రాజపేట లోని శ్రీ సరస్వతీ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లో బుధవారం జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సోమసాని సురేందర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటును రిజిస్టర్ చేయించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సందిల రాజు,శ్రీను,కృష్ణ, కరుణాకర్, లావణ్య,రవి, రాజు, శ్రవణ్ కుమార్ రెడ్డి , అశోక్ విద్యార్థులు లు పాల్గొన్నారు