Wednesday, 4 November 2026

రామారావు పాటిల్ ను ఆహ్వానించడానికి వచ్చిన ఎం.పి సొయం

రామారావు పాటిల్ ను ఆహ్వానించడానికి వచ్చిన ఎం.పి సొయం.
నవంబర్ 16 జనం సాక్షి భైంసా రూరల్
కాంగ్రెస్ డిసిసిఅధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పవర్ రామారావు పటేల్ ను భాజపా లోకి రావాలంటూ ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుసొయ0 బాపురావు బై0సా పట్టణం లోని రామన్న ఇంటికి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ లో రావాలంటూ ఆహ్వానించారు. రామన్న,ఎం.పి సొయం తో 30 నిమిషాల పాటు చర్చలు జరపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరులు సమావేశంలో రామన్న మాట్లాడుతూ… సోయ0 బాపురావు ఆలోచన మేరకు,స్థానిక కార్యకర్తలు అభిప్రాయం మేరకు,దేశ సేవ కొరకై త్వరలో నిర్ణయం తీసుకొని ముధోల్ అసెంబ్లీని అభివృద్ధి పథంలో తీసుకపోవడాని సహాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. సోయ0 బాపురావు ఆహ్వానాని పై కార్యకర్తలతో చర్చించి, కార్యకర్తల కోరికపై ముందుకు సాగుతానని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రామన్నతో చరవాణిలో సంభాషించి పార్టీలో రావాలని పిలుపునిచ్చారు.
ఎం.పి సోయంబాపు రాకవేల రామన్న నివాసం లో కార్యకర్తలు భారీ మొత్తం లో హాజరయ్యారు