నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ పోటీలు
జహీరాబాద్ జనవరి 12 (జనంసాక్షి) పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో గురువారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ క్వార్టర్ పోటీలో భాగంగా ఎక్స్ పర్ట్ ఏంఐసీసీ సీసీ హైదరాబాద్ మరియు కె ఎఫ్ కోహినూర్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో ఎక్స్ పర్ట్ ఏంఐసీసీ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 143 పరుగులకు అలౌట్ అవ్వడంతో, 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహినూర్ కె ఎఫ్ సీసీ 6 వికెట్ల నష్టనికి 147 పరుగులు చేయడంతో కోహినూర్ సీసీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఖిజర్ యఫై గోల్డ్ కప్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది, మధ్యాహ్నం మూడవ క్వార్టర్ ఫైనల్లో ఎస్ కె ట్రేడర్స్ మరియు అఫ్ఫన్ గువ్వల బాలరాజు సీసీ అచ్చంపేట జట్ల మధ్య జరిగిన పోటీలో ఎస్ కె ట్రేడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడంతో మొదటి బ్యాటింగ్ చేసిన అఫ్ఫన్ జి బిఆర్ జట్టు 20 ఓవర్లలో అలౌట్ అయి 164 పరుగులు చేయడంతో, 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ కె ట్రేడర్స్ జట్టు 20 ఓవర్లలో 162 పరుగులకు అలౌట్ అవ్వడంతో అఫ్ఫన్ జిబిఆర్ సీసీ 2 పరుగుల తేడాతో అఫ్ఫన్ జిబిఆర్ అచ్చంపేట సీసీ జట్టు విజయం సాధించి సెమి ఫైనల్లో ప్రవేశించింది, జట్టు విజయంలో కీలక భూమిక వహించిన సి ఏ కార్తిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న బంటు పురుషోత్తం రావు మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, అబ్దుల్ మాజిద్, విజయ్ రాథోడ్ సోషల్ మీడియా బి ఆర్ ఎస్ మండల ఇంచార్జ్, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.




