సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న నిర్వహించనున్న సూర్యాపేట జాతీయ రహదారి దిగ్బంధంను విజయవంతం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి వరంగల్ సూర్యాపేట టౌన్ ఇన్చార్జ్ మంద కుమార్పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మాదిగ కులస్తులందరూ, ఉప కులాల వారందరూ జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఇనుముల నర్సింహా, గద్దల సుకుమార్, రాజశేఖర్, బత్తుల వెంకటరమణ, దాసరి వెంకన్న , బొజ్జ వెంకన్న , దైద వెంకన్న, వెర్పుల ప్రవీణ్, జానీ తదితరులు పాల్గొన్నారు.




