జాతీయ లోక్ఆదాలత్ ను విజయవంతం చేయండి
జనంసాక్షి బోథ్ :
రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు విలువైన సమయంతో పాటు న్యాయం జరుగుతుందని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి హుస్సేన్ అన్నారు. ఈ సందర్బంగా కోర్టు హలులో శుక్రవారం న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో అయన మాట్లాడారు ఈ నెల 26న నిర్వహించనున్న జాతీయ లోక్ ఆదాలత్ ను విజయవంతం చేయాలని న్యాయవాదులకు సూచించారు. ఈ సమావేశంలో ఏజిపి సుభాష్ మోహన్ రావ్ బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్ ఠాకూర్ రూపేందర్ సింగ్ ఆడెపు హరీష్ విక్రమ్ పాల్గొన్నారు.