రఘునాధపాలెం మే 27 (జనం సాక్షి) మండలం మంచుకొండ గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు జాతీయస్థాయిలో విశిష్ట సేవా రత్న అవార్డును అందుకున్నారు. ఎస్ ఎస్ బి ఎం జాతీయ సంస్థ పలు రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురికి ఇటీవల అవార్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో మంద సంజీవరావు అందిస్తున్న సేవలకు గానూ అరుదైన గౌరవం దక్కింది. శనివారం గోవాలోని ప్రముఖ రిసార్ట్స్ లో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవంలో జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ చేతుల మీదుగా సంజీవరావు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెర్మియా, ఖమ్మం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దేవరకొండ కళ్యాణి, వైరా అధ్యక్షులు లేగల జీవరత్నం, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు మారపాక పృద్వి, టౌన్ ఫోటో స్టూడియో అసోసియేషన్ అధ్యక్షులు మంద విజయ రావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ విశిష్ట సేవ రత్న అవార్డు అందుకున్న సంజీవరావు




