Wednesday, 4 November 2026

వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. -ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్.

బెల్లంపల్లి, మే 27, (జనంసాక్షి )
వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వడగళ్ళ వర్షాల వల్ల రైతులకు అపార నష్టం జరిగిందని, కనీసం ఎకరానికి 20 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన వరిధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా క్వింటాలుకు 3200 రూపాయలు చెల్లించాలని, రైతులకు ఉచితంగా టార్ఫిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో చదువుల దుర్గక్క, ఇందారపు పోశం, కరవేనా కళావతి, వేల్పుల రాజేశ్వరి, చిలుక ఆశయ్య, సూరం కుమార్, అంగర్ల సంపత్, రంగ రాంచందర్, ఆడే సతీష్ పాల్గొన్నారు