Thursday, 5 November 2026

జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 20. (జనంసాక్షి). భాషా సాంస్కృతిక శాఖ ,మానేరు రచయితల సంఘం సౌజన్యంతో నిర్వహించనున్న  జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల సాహిత్యానికి ప్రోత్సాహం అందించేందుకు మార్చి 24న సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల సాహిత్యానికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని  అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వడ్లూరు శ్రీనివాస్, డాక్టర్ ఎం మల్లారెడ్డి, మానేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్, జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వాసవేణి పరుశురాములు పాల్గొన్నారు.