Thursday, 5 November 2026

సుందిళ్లలో మోడల్ స్కూల్స్ ప్రారంభించిన సర్పంచ్

 జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి సుందిల్ల గ్రామంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు సహకారంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన రెండు మోడల్ స్కూల్స్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సుందిల్ల (అంచనా వ్యయం 20.లక్షలు), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నరసింహులపల్లి (అంచనా వ్యయం 19.లక్షల) నిర్మించిన, మౌలిక సదుపాయాలు కల్పించిన తరగతి గదులను వంటశాలను సర్పంచ్ దాసరి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటగా చేసేందుకు మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభించారని కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అవసరం ఉన్న దగ్గర నూతనంగా గదులను, టాయిలెట్స్, వంటశాలలను, ప్రహరీ గోడలను నిర్మించడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పించడం వంటివి మొదలుకొని పాఠశాలలో మొక్కలు నాటుతూ సుందరీకరించారని మా గ్రామంలో సుమారు 39 లక్షల రూపాయలతో గ్రామంలోని మోడల్ స్కూల్స్ ను అభివృద్ధి చేశారని గతంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగా లేక పిల్లలను ఎంతో దూరం బస్సులలో పంపేవారమని కానీ ఏడాది మౌలిక సదుపాయాలు కల్పించడం వలన వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు , కార్యదర్శి సరిత, ఎస్ఎంసి చైర్మన్ ఎరుకల సుమలత, పాఠశాల కరస్పాండెంట్లు రఘు, సునీత దేవి, పాలకవర్గ సభ్యురాలు జనగామ పద్మ, బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్, టీచర్స్ రమేష్, శ్రీనివాస్, వెంకట్ నారాయణ, రాధిక,లలిత,వసుందర అన్నపూర్ణ, ఆశలత, సరోజన, అరుణ తదితరులు పాల్గొన్నారు.