Wednesday, 4 November 2026

జానోదయ డిగ్రీ, పీజీ కళాశాల నూతన విద్యార్థులకు స్వాగత ఉత్సవ కార్యక్రమం

జానోదయ డిగ్రీ, పీజీ కళాశాల నూతన విద్యార్థులకు స్వాగత ఉత్సవ కార్యక్రమం*
మెట్పల్లి టౌన్, నవంబర్ 29,
జనం సాక్షి:
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థిని విద్యార్థులకు తృతీయ ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు స్వాగత ఉత్సవ కార్యక్రమాన్ని మనోహర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు ,దీనిలో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో నృత్యాలతో విద్యార్థిని విద్యార్థులు ఆకట్టుకున్నారు, అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మొదట జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభోత్సవం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల వ్యవస్థ లో భాగంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో, విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించాలని సదుద్దేశంతో కళాశాల స్థాపించడం జరిగిందని అన్నారు ,ఇందులో ఉన్నత చదువు పూర్తి చేసుకున్న ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో ఉన్నారని వారు కళాశాల కు పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారని, విద్యార్థిని విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానం ,లక్ష్యం , సాధించాలనే ఉద్దేశ్యం, పట్టుదల ఉండాలని దీని ద్వారా ప్రతి ఒక్కరు ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానంలోకి చేరుతారని అన్నారు,ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, చైర్మన్ మహాజన్ నర్సింలు, డైరెక్టర్ కమలాకర్ రావు ,వేణుగోపాల్, దొంతుల రాజ్ కుమార్, చెర్ల పెళ్లి రాజేశ్వర్గౌడ్ ,సాయి గౌతమ్, ప్రిన్సిపాల్ కె.వి సంతోష్ ,వైస్ ప్రిన్సిపాల్ రాజు ,అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు