సజావుగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం.
బెల్లంపల్లి, నవంబర్ 29, (జనంసాక్షి )
బెల్లంపల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్మన్ జక్కుల శ్వేతా అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో సజావుగా సాగింది.సమావేశములో పట్టణ అభివృద్ధి కొరకు పలు అంశాలను తీర్మాణించారు
బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా బస్టాండ్ వద్ద బస్సులను రోడ్డు ఫై నిలుపుట వలన ట్రాఫిక్ అంతరాయము కలుగుచున్నందున బస్టాండ్ వెనుకగల రోడ్డును విస్తరించి నూతనముగా రోడ్డు నిర్మాణము చేయుటకు దాదాపు రూ. 15.00 లక్షలను పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. పారిశుద్ధ్య నిర్వాహణకు వినియోగిస్తున్న వాహనాలు నిలుపు స్థలము, పాత మునిసిపల్ కార్యాలయము నందు పార్కింగ్ షెడ్డు ఏర్పాటు చేయుటకు , దాదాపు రూ. 45. 00 లక్షలను పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. నూతనముగా ఏర్పాటు చేసిన కన్నాల పార్క్, పోచమ్మ పార్కులలో కొరియన్ గ్రాస్ మరియు స్ట్రీట్ ఆర్ట్ పెయింటింగ్ వేయుటకు సుమారు రూ. 5. 00 లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. శిశుమందిర్ రోడ్డును వెడెల్పు చేయుటకు తీర్మాణించారు. నర్సరీలకు అవసరమగు పాలిథిన్ బ్యాగులు కొనుగోలు చేయుటకు రూ . 0. 65 లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. నూతనముగా ఏర్పాటు చేయబడిన రెండు పార్క్ లకు 10 చెత్త డబ్బాలను ఏర్పాటు చేయుటకు 0. 05
లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. సుబ్బారావు పల్లి నందు గల కల్వర్టు వర్షాల వలన కొట్టుకు పోయినందున ముందస్తు ప్రమాదాలు జరగకుండా రిటెయినింగ్ వాల్ ఏర్పాటు చేయుటకు రూ 5. 00 లక్షలు పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. శిశుమందిర్ ఏరియా లో ఉన్న కరెంటు పోల్స్ కి సిరీస్ లైట్లు ఏర్పాటు చేయుటకు రూ . 5.00 లక్షలు పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు తీర్మాణించారు. సింగరేణి కళా వేదిక ప్రక్కన మరియు కాల్ టెక్స్ నందు ఏర్పాటు చేసిన స్త్రీట్ వెండర్ జోన్స్ ఆయా స్త్రీట్ వెండర్లకు కేటాయించుటకొరకు కౌన్సిల్ ఆమోదం తెలిపినారు. ఈసమావేశంలో
మునిసిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్, డి ఈ మసూద్ అలీ, ఎలక్ట్రికల్ ఏ ఈ శ్రీనివాస్, వైస్ ఛైర్మెన్ బత్తుల సుదర్శన్, కౌన్సిల్ సభ్యులు ,కో ఆప్షన్ సభ్యులు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,
సజావుగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం




