ఖుంతి: జార్ఖండ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టిన 18 బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఖుంతీ జిల్లాలోని ఫదింగ-తురంగ్ గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి వీటిని గుర్తించినట్టు ఎస్పీ అనీష్ గుప్తా తెలిపారు. జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టి మెటల్ డిటెక్టర్‌తో కూడిన బాంబులను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.




