నిజామాబాద్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, ద్రోహి అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ను దేశం గర్వించదగ్గ నాయకున్ని చేసింది కార్యకర్తలే అని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో టీడీపీని నామరూపం లేకుండా చేయాలని కార్యకర్తలకు సూచించారు.





