Monday, 2 November 2026

జార్జిఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు జయాజైట్లీకి సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టి అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న కేంద్రరక్షణశాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీకి సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభించింది. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జయాజైట్లీ ప్రతి పదిహేనురోజుల కొకసారి జార్జి ఫెర్నాండెజ్‌ను పరామర్శించవచ్చు. ఆమెకు కేవలం 15 నిముషాల పాటు మాత్రమే అక్కడ ఉండేందుకు కోర్టు అనుమతించింది. ఉభయపక్షాల స్పందనలను పరిశీలించిన సుప్రీం కోర్టు…. చివరకు జయాజైట్లీకి ఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు అనుమతినిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *