గద్వాల నడిగడ్డ,, ఏప్రిల్ 7 (జనం సాక్షి);
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం నుండి మే నెల 6 వ తేది వరకు జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా నిషేధిత ఆజ్ఞలను జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె. సృజన ఒక ప్రకటనలో తెలిపారు.1861పోలీస్ చట్టం రూల్ 30 లోని నిబంధనల మేరకు నిషేధాజ్ఞల సమయంలో డి. ఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు,సమావేశాలు , ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ పేర్కొన్నారు.అలాగే ఆయుధాలు ,పేలుడు సామాగ్రి ,కర్రలు వంటివి తీసుకువెళ్లడం నిషేధమని, రోడ్లు, పబ్లిక్ స్థలాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం, సమూహాలు గా ఏర్పడటం వంటివి నిషేధం అని తెలిపారు. లౌడ్ స్పీకర్లు,డీజే ల ద్వారా సందేశాలు ఇవ్వడం,మైకులు వినియోగించడం, ఏదైనా సంస్థలు వాహనాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం లేదా హారన్ల ను వినియోగించడం నిషిద్ధమని ఎస్పీ వెల్లడించారు. ఎవరైనా పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లయితే 1861 పోలీస్ చట్టం ప్రకారం శిక్ష అర్హులవుతారని ఎస్పీ వెల్లడించారు. పై నిషేధాజ్ఞలనుండి విధులలో ఉన్న పోలీసు అధికారులు ,మిలిటరీ లో పని చేసేవారు, హోంగార్డులు, ముందస్తు అనుమతి పొందిన అంతిమయాత్ర ర్యాలీలకు మినహాయింపు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పై ఉత్తర్వులు నేటి నుండి మే నెల 6 వ తేదీ సాయంత్రం 6 గంటల* వరకు అమలులో ఉంటాయని ఎస్పీ వెల్లడించారు.
జిల్లాలో నేటి నుండి మే 6 వరకు నిషేధజ్ఞులుజిల్లాలో నేటి నుండి మే 6 వరకు నిషేధజ్ఞులు -జిల్లా ఎస్పీ సృజన.




