Wednesday, 4 November 2026

మైనారిటీల అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి : పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహియోద్దీన్  

 

 

 

 

 

 

 

 

 

జహీరాబాద్. ఏప్రిల్ 7( జనం సాక్షి) రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడలేని విదంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, అమ్మాయి పెళ్లి చేస్తే 1 లక్ష 116 రూపాయల ప్రభుత్వ సహకారం అందించి అమ్మాయికి సీఎం కేసీఆర్ మేనమామ పాత్ర పోషిస్తున్నారని, ఇమాం, మౌజన్ లకు గౌరవ వేతనంగా 5 వెయ్యిల రూపాయలు అందిస్తుందని, గత 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్లు 99 లక్షల రూపాయల గౌరవ వేతనం విడుదల చేయడంపై జహీరాబాద్ పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సయ్యద్ మోహియోద్దీన్ హర్షం వ్యక్తం చేస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, ఎమ్మెల్యే మణిక్ రావు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గత నెల క్రితం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ముస్లింల ఆర్థికభివృద్ది, స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీతో కూడిన రుణాలు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు…