గద్వాల నడి గడ్డ, మే 16 (జనం సాక్షి);జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టరేట్ సమావేశహాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్ పి సృజన తో కలిసి పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 45 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.
వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్ లో దాదాపు మాయమయ్యాయి అని, అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టిసారించి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60 శాతం మేర తెలంగాణ నుండి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు.
తెలంగాణలో ఉన్న విత్తన ఉత్పత్తి పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా, నకీలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుండి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో 1.50 లక్షల ఎకరాలలో పత్తి , 1 లక్ష వరకు మిర్చి వేయుటకు అంచనాలు ఉన్న్నాయని, రైతు వేదికల్లో టాస్క్ పోర్సు సమావేశాలు ఏర్పాటు చేసి నకీలి విత్తనాలు అరికట్టడానికి అనుసరించాల్సిన పద్దతులను రైతులకు వివరించమని ,బార్డర్ ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని మంత్రి కి తెలిపారు. మంత్రి సూచనల మేరకు వచ్చే వానాకాలం వివిధ పంటలు కింద అవసరాల కోసం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూన్నామని తెలిపారు.
జిల్లా ఎస్ పి సృజన మాట్లాడుతూ జిల్లా లో బార్డర్ ఏరియాలలో మొత్తం 7 . చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని , జిల్లా లో 272 షాపులనురైడ్ చేసామని 48 మందిని బైన్దోవార్ చేసామని జిల్లా , మండల స్తాయి లో తస్క్ పోర్సు సమావేశాలు ఏర్పాటు చేస్తునామని తెలిపారు. సమచారమ వస్తే కచితంగా కేసులు పెడుతున్నామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఎప్పటికప్పుడు సమాచారంతెలుసుకుంటూ నకీలీ విత్తనాల పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డి ఎస్ పి రంగ స్వామి,అసిస్టెంట్ డైరెక్టర్ లు సంగీత, సక్రి నాయక్ , మండల వ్యవసాయవిస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




