జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయి మొదటిసారిగా రామగిరి మండలానికి విచ్చేసిన రావుల రాజేందర్ కి మండల బిజెపి నాయకులు మంగళవారం ఘనంగా స్వాగతం పలికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ మాట్లాడుతూ.. బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాతంగి రేణుక, బిజెపి నాయకులు మోలుమూరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్ మంథని నియోజకవర్గం జాయింట్ కన్వినర్ తొట్ల రాజు, నాయకులు కుంట చక్రి, మెరుగు శ్రీకాంత్, కన్నురి మోహన్, కన్నురి ఓదెల్, బనుక సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




