బెల్లంపల్లి, ఏప్రిల్ 18, (జనంసాక్షి )11 వ వేజ్ బోర్డులో మెరుగైన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రాన్ని అందజేశారు. పదవ వేజ్ బోర్డు కాల పరిమితి ముగిసి 22 నెలలు గడిచినందున కోల్కతాలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో మెరుగైన పూర్తి స్థాయి ఒప్పందం చేసుకోవాలని, అలా జరగని పక్షంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు, చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, రాజనాల రమేష్, సూరం మల్లేష్, దాడి రమేష్, కొట్టె రమేష్, టిబిజికెఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.




