Saturday, 7 November 2026

దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది భారత రాజ్యాంగం.

దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది భారత రాజ్యాంగం..
– మండలంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.
– తహాసిల్దార్ జాకిర్ అలీ.
ఊరుకొండ, నవంబర్ 26 (జనంసాక్షి):
దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అని తహాసిల్దార్ జాకిర్ అలీ అన్నారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట, నర్సంపల్లి, జగబోయినపల్లి, తదితర గ్రామాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు అధికారుల సమక్షంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి కులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అందరూ కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దండోద్కర్ అనిత నాగోజి, వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్, ఉపసర్పంచ్ లు, వార్డ్ సభ్యులు సిద్దు, శ్రీను, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.