Tuesday, 3 November 2026

పోరు గడ్డ నుండి పోడు పట్టా

మన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి పోడు పట్టాలు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం….
ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి మనమంతా అధిక సంఖ్యలో హాజరై కృతజ్ఞత తెలిపాలి..నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి కి విన్నవించి నిధులు తీసుకొస్తా……
కౌటాల మండలం బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…..ఎన్నో ఏళ్లుగా సమస్యగా మారిన పోడు భూముల పట్టాలను పరిష్కరించి పోడు రైతులకు పట్టాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కి మనమంతా కృతజ్ఞతతో అధిక సంఖ్యలో హాజరవ్వాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు తెలిపారు..ఈనెల 30 వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కౌటాల మండల బిఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమావేశం నిర్వహించి,
ముఖ్యమంత్రి బహిరంగ సభకు సిర్పూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో కౌటాల మండల ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు